ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి' - కళ్యాణదుర్గంలో కరోనా పై అవగాహన కార్యక్రమం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కరోనా నివారణపై ఆర్​డీటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ.. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి.. ప్రజలకు కరోనాపై అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అవగాహన కల్పించారు.

కరోనాపై అవగాహన కార్యక్రమం
కరోనాపై అవగాహన కార్యక్రమం

By

Published : May 11, 2021, 7:50 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆర్​డీటీ స్వచ్ఛంధ సంస్థ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. విచిత్ర వేషధారణలతో ఆర్​డీటీ కళాకారులు రహదారులపై ప్రదర్శన ఇచ్చారు. స్థానిక పోలీసుల సహకారంతో జరిగిన ఈకార్యక్రమాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించడం... అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రావడం వంటి విషయాలపై కళాకారులు అవగాహన కల్పించారు.

శ్రీకాకుళం జిల్లాలో...

కొవిడ్ మహమ్మారిని తగిన జాగ్రత్తలతో అడ్డుకోవాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీసులు పిలుపునిచ్చారు. సీఐ ఆర్.నీలయ్య, ఎస్సై కామేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ప్లకార్డులతో చైతన్య ర్యాలీ నిర్వహించారు. డబుల్ మాస్క్ ధరించాలని, సానిటైజర్ వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికి రోడ్లపై వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అత్యవసరమైన పనులపై ఆధారాలు చూపిన వారిని తప్ప మిగిలిన వారిని వెనక్కి పంపిస్తున్నారు. మాట వినని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.

విశాఖలో...

కర్ఫ్యూ అమలు తీరును శాంతిభద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షించారు. మద్దిలపాలెం కూడలిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో మాట్లాడారు. అనవసరంగా బయటకు తిరిగే వారిని ఆపి కేసులు నమోదు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

అరండల్​ పేట పోలీస్ స్టేషన్​లో చంద్రబాబుపై కేసు నమోదు!

'కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం!'

ABOUT THE AUTHOR

...view details