పరీక్షల కోసం వచ్చిన 8 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్ - ఏపీ కరోనా కేసుల సంఖ్య న్యూస్
19:10 June 22
ధర్మవరంలో కరోనా కలకలం
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎనిమిది మంది గర్భిణులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఈ నెల 19న ధర్మవరంలో గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో వారికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
కరోనా సోకిన గర్భిణులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. వారికి కరోనా ఎలా సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వీరంతా వెళ్లినట్లు బంధువులు పేర్కొంటున్నారు.