ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొబ్బరిచెట్టు... కూలీ ప్రాణం తీసింది! - anantapur

ఉరవకొండలో ప్రమాదంలో కూలీ మృతి చెందాడు. కొబ్బరిచెట్టు కొడుతుండగా మీద పడి చనిపోయాడు.

వ్యక్తి మృతి

By

Published : Sep 5, 2019, 8:28 PM IST

కొబ్బరిచెట్టు మీద పడి వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఇందిరానగర్ లో.. కొబ్బరి చెట్టు మీద పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఉలిగప్ప అనే వ్యక్తి.. తన ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మలు విరిగి పడగా... చెట్టును కొట్టేంచేందుకు ఆంజనేయులు అనే కూలీని పిలిపించాడు. వేపచెట్టు తర్వాత కొబ్బరి చెట్టును కొడుతున్న సమయంలో.. అది విరిగి ఒక్కసారిగా ఆంజనేయులు తలపై పడింది. 50 ఏళ్ల వయసున్న ఆయన.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య, కుమారుడు ఆంజనేయులు మృతదేహంపై పడి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ.. బొప్పాయి పండ్లు అమ్ముతూ జీవనం సాగించేవాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details