కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో రెండేళ్లుగా చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో చేసిన పలు అభివృద్ధి పనులకు బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బిల్లులు రాక మానసికంగా అందోళన చెందుతున్నామన్నారు.
అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన చెందారు. ఈ విషయమై కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. బిల్లులు మంజూరు చేయకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు స్పష్టం చేశారు. సత్వరమే నిధులు విడుదల చేయనిపక్షంలో.. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.