ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం రైతు వ్యతిరేక విధానాలతోనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి' - హిందూపురంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ.. అన్నదాతలకు బేడీలు వేసిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానానికి చేరుకుందన్నారు. రైతుల డిమాండ్లు పరిష్కరించకపోతే దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

tulasi reddy
తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత

By

Published : Dec 10, 2020, 3:49 PM IST

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలంలోనే రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ.. వారికి బేడీలు వేసిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పంపుసెట్లకు మీటర్లు బిగించే జీవో అన్నదాతల మెడలకు ఉరితాళ్లు బిగించిందన్నారు. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు రాజధానిలో ఆందోళన చేస్తున్నా.. భాజపా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. రైతుల డిమాండ్లు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తులసిరెడ్డి అన్నారు.

ఇవీ చదవండి..

అమరావతి ఉద్యమం: ఆగిన మరో రైతు గుండె

ABOUT THE AUTHOR

...view details