ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితుల ఆందోళన

కరోనా బాధితులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రంలో యువకులు ఆందోళన చేశారు. నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Concern of corona victims at the Quarantine Center
క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితుల ఆందోళన

By

Published : Sep 24, 2020, 10:25 PM IST

కరోనా బాధితులని జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని...క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రంలో పదుల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నారు. ఆహారంలో నాణ్యత లేకుండా హీనంగా చూస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఏ మాత్రం నాణ్యత, రుచిలేని భోజనాన్ని తమ మొహాన వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగ నిరోధక శక్తి పెరగకపోవటంతో పాటు మరిన్ని సమస్యల బారిన పడాల్సి వస్తుందని...అక్కడున్న యువకులు వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు హోటల్ యజమానులను మందలించారు. నాణ్యమైన భోజనం అందిస్తామని హామీఇచ్చారు.

ఇదీ చదవండి:

'రూ. 80 కోట్లతో ఆయిల్​ ఫామ్ రైతులకు చేయూత'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details