ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగు భూమి కోసం ఘర్షణ... రాళ్లతో దాడి చేసుకున్న మహిళలు - కుమ్మురులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Clashes between two Groups: కూడేరు మండలం కమ్మూరులో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ చోటు చేసుకుంది. భూవివాదం నేపథ్యంలో పొలంలోనే మహిళలు పరస్పరం దాడి చేసుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి.

Clashes between two Groups
ఇరువర్గాల మధ్య ఘర్షణ

By

Published : May 13, 2022, 8:00 PM IST

Clashes between two Groups: అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరులో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. భూవివాదంపై పొలంలోనే ఇరు వర్గాల మహిళలు... కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దాదాపు 70 ఏళ్లుగా ఓ కుటుంబం భూమి సాగు చేసుకుంటోంది. అదే గ్రామానికి చెందిన మరికొందరు... భూమి తమదేనంటూ వాదనకు దిగారు. ఈక్రమంలో తీవ్రస్థాయి గొడవ జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details