రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దేశంలోనే ఆదర్శంగా మారబోతోందని ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. అనంతపురం జిల్లాలోని పలు పౌరసరఫరాల గోదాములను ఆయన ఆదివారం పరిశీలించారు. డిసెంబర్ లేదా జనవరి మొదటి వారం నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 9260 వాహనాలను కూడా కొనుగోలు చేసినట్లు.. వాటి బాధ్యతను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
'రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దేశంలోనే ఆదర్శంగా మారబోతోంది' - పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వార్తలు
అనంతపురం జిల్లాలోని పలు పౌరసరఫరాల గోదాములను పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పరిశీలించారు. డిసెంబర్ లేదా జనవరి మొదటి వారం నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
'ప్రతి ఇంటికి నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం'