అనంతపురం జిల్లా పెనుకొండలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో వ్యాపారీకరణ, మతతత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నూతన విద్యా విధానం ఆమోదించిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు 50 లక్షల బీమా సౌకర్యం, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హరి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు బావమ్మ, మాబు నీసా, శ్రీదేవి, పార్వతమ్మ, వరలక్ష్మి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండలో సీఐటీయూ నాయకుల నిరసన
అనంతపురం జిల్లా పెనుకొండలో సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పెనుకొండలో సీఐటీయూ నాయకులు నిరసన