అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కర్నూలు సీఐడీ ఇన్స్పెక్టర్ ఎస్. రుషికేష్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలోని రికార్డులు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనుగోలు చేసిన పరికరాలపై తలెత్తిన అవినీతి ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రాంతీయ ఆస్పత్రులు, కమ్యూనిటీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 2015 సంవత్సరం నుంచి 2018 వరకు కొనుగోలు చేసిన పరికరాల విలువ, వాటి నిర్వహణపై కర్నూలు సీఐడీ ఇన్స్పెక్టర్ ఎస్. రుషికేష్ ఆరా తీశారు. తనిఖీల అనంతరం నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.