అనంతపురంలో ఐదు నెలల తర్వాత ఓ మోస్తరు వర్షంతో వానదేవుడు కదిరి ప్రాంతాన్ని పలకరించాడు. దీంతో ఆనందంతో చిన్నారులు కేరింతలు కొట్టారు. ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభం నుంచి చినుకు నేల రాలేదు..ముఖం చాటేసిన వరుణుడు కరుణించడంతో రైతులతో పాటు చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు. కరాటే ఆడేందుకు వెళ్లిన పిల్లలు వర్షంలో తడుస్తూ ..నీటిని చల్లుకుంటూ ఆటలు ఆడారు. పిల్లల కేరింతలతో తల్లిదండ్రులు, కరాటే కోచ్లు సంబరపడ్డారు.
వాన వాన వల్లప్ప ఆడుదామీలా...!
వర్షం రాకతో పిల్లల్లో ఉత్సాహం ఉరకలువేసింది..చిరుజల్లులో తడుస్తూనే ..చిన్నారులు కేరింతల నడుమ వర్షంలో ఆడిపాడారు.
children did dance in rain ata kadiri in ananthapur distirct