ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి - చిన్నారి మృతి

అమ్మ ఒడిలో ఆనందంగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. అభం శుభం తెలియని పసిదాన్ని పొట్టన పెట్టుకొన్న డెంగీ మహమ్మారి... ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

డెంగ్యూ లక్షణాలతో చిన్నారి మృతి

By

Published : Sep 6, 2019, 2:34 PM IST

Updated : Oct 30, 2019, 8:23 PM IST

డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి..

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని నెహ్రూ కాలనీకి చెందిన వైష్ణవి అనే చిన్నారి డెంగీ లక్షణాలతో మృతి చెందింది. మూడు రోజులుగా జ్వరం బారిన పడిన చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ లక్షణాలు ఉన్నాయని తేల్చారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారిని కర్ణాటక బళ్ళారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చిన్నారి తుదిశ్వాస విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి విగతజీవిగా మారడంపై.. తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. వారి ఆవేదనను చూసి స్థానికులూ కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణంలో పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టని కారణంగానే పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని... వాటి ద్వారానే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Last Updated : Oct 30, 2019, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details