చలో పులివెందుల పేరుతో అనంతపురం జిల్లా కదిరి నుంచి బయలుదేరిన తెలుగుదేశం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కడప జిల్లా లింగాల మండలంలో ఎస్సీ మహిళపై హత్యాచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం చలో పులివెందుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కదిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం శ్రేణులు బయలుదేరాయి.
కదిరిలో ఉద్రిక్తంగా చలో పులివెందుల కార్యక్రమం - అనంతపురం జిల్లా నేర వార్తలు
చలో పులివెందుల కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమానికి వెళ్తున్న అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఉద్రిక్తంగా చలో పులివెందుల కార్యక్రమం
ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బృందాలుగా ఏర్పడి పులివెందులకు బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపుల మండలం బండమీదపల్లి, కొత్తపల్లి నుంచి వివిధ ప్రాంతాల్లో నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొందరు నాయకులను పోలీసులు అడ్డుకోగా... మరికొందరు కార్యక్రమానికి చేరుకున్నారు. బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందిని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.