అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారని... కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవేం పట్టనట్టు స్వార్థపూరిత ఆలోచనలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై అనంతపురంలో త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
'ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి' - chalasani srinivas prees meet at anantapur news
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్