అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని వెంకటగిరిపాళ్యం గ్రామానికి చెందిన శ్మశాన వాటిక నీటితో నిండింది. సమీపంలోని గొల్లపల్లి జలాశయం నుంచి ఊట నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊళ్లో ఎవరైనా మరణిస్తే మోకాళ్ల లోతు నీటిలో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటితో నిండిన శ్మశానం.. అంత్యక్రియలకు కష్టం
శ్మశాన వాటిక నీట మునగటం వల్ల పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు అవస్థలు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలో వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అంత్యక్రియలకు అవరోధం
ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. నీరు నిల్వ ఉన్నందునా గ్రామంలో దుర్గంధం, దోమల బెడద ఎక్కువైందన్నారు. చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి: బిల్లూరివాండ్లపల్లిలో అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం