ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికలను కిడ్నాప్ చేసిన వాలంటీర్లపై కేసు నమోదు - శింగనమల వాలంటీర్లు వార్తలు

అనంతపురం జిల్లాలో ఇద్దరు బాలికలను అపహరించిన వాలంటీర్లపై కేసు నమోదైంది. బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

cases filed on volunteers for kidnapping girls in singanamala mandal
cases filed on volunteers for kidnapping girls in singanamala mandal

By

Published : Jun 28, 2020, 3:31 PM IST

మీడియాతో సీఐ విజయ భాస్కర్​ గౌడ్

అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఇద్దరు బాలికలను అపహరించిన ముగ్గురు గ్రామ వాలంటీర్లు సహా మరో ఇద్దరిపై కేసు నమోదయ్యింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ విజయ భాస్కర్​ గౌడ్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15, 17 ఏళ్ల బాలికలను గ్రామ వాలంటీర్లు శివరాం, చంద్రశేఖర్‌, మధుసూదన్‌తో పాటు వారి మిత్రులు చంద్రముత్యాలు, రామాంజనేయులు ఈనెల 25న అపహరించారు. మత్తు మందు ఇచ్చి కారులో అనంతపురం తీసుకెళ్లారు.

బాలికలు వారి చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. బాధితుల కుటుంబసభ్యులు ఈ నెల 26న పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ విజయ భాస్కర్ గౌడ్ తెలిపారు. కిడ్నాపర్లను పట్టుకొని విచారణ చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details