అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని 28,29 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్లలోపు తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ 15మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వారిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని తెదేపా నేతలపై కేసు - tdp latest news in kadiri
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని అనంతపురం జిల్లాలో తెదేపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని తెదేపా నేతలపై కేసు