తెలంగాణలో దారుణానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ - candle rally
తెలంగాణలో చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గుంతకల్లులో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.
తెలంగాణలోని హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ లైఫ్ బ్లడ్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక పొట్టి శ్రీరాములు కూడలి నుంచి మహాత్మగాంధీ కూడలి వరకు సాగిన ర్యాలీలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మెప్మా అధికారులు పాల్గొన్నారు. లైఫ్ బ్లడ్ సొసైటీ ప్రెసిడెంట్ బాల బ్రహ్మ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి... నిందితుడికి కఠినమైన శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుర్మార్గపు చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు మెప్మా అధికారి హరిప్రియ.