అనంతపురంలో పేదల కోసం నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను సీపీఎం నాయకులు పరిశీలించారు. ఇళ్లను పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని సీపీఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లను నిర్మించాలని.. ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించిందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం డిపాజిట్లను రద్దు చేసి కొత్త పట్టాలు ఇస్తామని చెప్పటం న్యాయం కాదని పేర్కొన్నారు.
'పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలి' - అనంతపురం
అనంతపురంలో పేదల కోసం నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను సీపీఎం నాయకులు పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు చెందాల్సిన ఇళ్లను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పునాది దశనుంచి 25 శాతం పనులు పూర్తైన ఇళ్లను మధ్యలో ఆపి ప్రజాధనం దుర్వినియోగం చేయటం సరికాదన్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల్లో, ఇళ్ల పై పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీల పరంగా కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రవర్తించాలని చెప్పారు. నాయకుల పై కోపాలతో ప్రజల జీవితాలతో ఆడుకో వద్దంటూ హితవు పలికారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధానాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రవర్తించాలని కోరారు.
ఇదీ చదవండిజిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అనిశా తనిఖీలు