ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెళ్లి పీటలెక్కాల్సిన వధువు.. రోడ్డు ప్రమాదంలో మృతి' - anantapuram district news

పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తండ్రితో కలిసి పెళ్లిపనులపై వెళ్లిన ఆమె ప్రమాదంలో మృతి చెందింది.

road accident
road accident

By

Published : Aug 28, 2021, 5:36 PM IST

మరో ఐదు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి.. రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. పెళ్లి పనుల కోసం ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువతి, ఆమె తండ్రిని వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో.. యువతి శరీరం ఛిద్రమైంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించలోగా కన్నుమూసింది. ఈ ఘటన వివరాలివి.

అనంతపురం జిల్లా సంతేబిదనూరు కు చెందిన నరసింహమూర్తి ఏకైక కుమార్తె వివాహం సెప్టెంబర్ 2న జరగాల్సింది. పెళ్లి పనుల నిమిత్తం తండ్రీ కూమార్తె కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా హిందూపురంలో మోత్కుపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన కుమార్తె చైతన్యను హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. తండ్రి నరసింహమూర్తి కి తీవ్రగాయాలు కాగా.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన వారి ఇంట్లో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details