అనంతపురంలోని మునిరత్నం మోటార్స్ యజమాని శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు ఇవాల్టి నుంచి పారిశుద్ధ్య కార్మికులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ కొనసాగినంత కాలం కార్మికులకు టిఫిన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని రవాణా శాఖ జిల్లా జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. ఎక్కడ ఆపద కలిగినా ప్రజలకు అండగా నిలవటంలో మునిరత్నం మోటర్స్ శ్రీనివాసులు ముందుంటారని డీటీసీ అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోటానికి పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని, హోటళ్లు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని శ్రీనివాసులు చెప్పారు. బస్సు యజమానులు.. కార్మికుల ఆకలి తీర్చటానికి ముందుకు రావటం గొప్ప విషయమని సీపీఎం జిల్లా కార్యదర్శి రామభూపాల్ అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు అండగా దాతలు
అనంతపురంలో పేదల ఆకలి తీర్చటానికి పెద్దఎత్తున దాతలు ముందుకు వస్తున్నారు. సూర్యోదయానికి పూర్వమే రహదారులపైకి, వీధుల్లోకి వచ్చి నగరాన్ని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించేందుకు ప్రైవేట్ బస్సుల యజమానులు ముందుకు వచ్చారు.
పారిశుధ్య కార్మికులకు అండగా దాతలు