గ్రామీణ ప్రాంతాల్లోని పొలిమేర గంగమ్మ, గ్రామ దేవతలు, ఇతర గుళ్లలో దీపదూప నైవేథ్యాలు చేస్తున్న బ్రాహ్మణేతర పూజారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు.మన సంస్కృతి , సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తున్న వారిపై నిర్లక్ష్యం తగదన్నారు.ఆధ్యాత్మిక చింతనతోపాటు, సామాజిక అంశాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బ్రాహ్మణేతరులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భాగంగా దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
"పూజారులకు ప్రత్యేక కార్పొరేషన్ నెలకొల్పాలి" - అనంతపురం జిల్లా
పూజారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణేతర పూజారులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో బ్రాహ్మణేతర పూజారుల సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి..బ్రాహ్మణులు