ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదాము దాటని పుస్తకం

పాఠ్యపుస్తకం గోదాము నుంచి కదలనంటోంది. లాక్‌డౌన్‌తో వాహనాల రాకపోకలకు అనుమతులు లేక పుస్తకం గోదాముకే పరిమితమైంది. ఏటా ఇప్పటికే సగం పాఠ్యపుస్తకాలు మండల వనరుల కేంద్రాలకు సరఫరా చేసేవారు. ఈ ఏడాది నెల కిందటే పుస్తకాలు వచ్చినా వాటి సరఫరాకు వీలు కాలేదు. ఇదీ అనంతపురం జిల్లాలోని పుస్తకాల పరిస్థితి.

books remained in godown in ananthapuram district
పుస్తక నిల్వలు

By

Published : Apr 27, 2020, 9:00 AM IST

అనంతపురం జిల్లాలో 6 నుంచి 10 తరగతి వరకు మొత్తం 10,78,451 పుస్తకాలు అవసరమని గుర్తించారు. ఇప్పటి దాకా ముద్రణ సంస్థల నుంచి 9,88,704 పుస్తకాలు అందాయి. నిరుడు మిగిలిన పుస్తకాలు 47,367 ఉన్నాయి. మొత్తంగా 10,36,071 పుస్తకాలు నిల్వ ఉన్నాయి. ఏడో తరగతికి 23 టైటిల్స్‌, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 27 టైటిల్స్‌ చొప్పున అవసరం. ఇప్పటికే సరిపడా పుస్తకాలు ఉన్నాయి. గోదాము నుంచి మండల వనరుల కేంద్రాలకు పంపడమే తరువాయి.

లెక్క తేలని ప్రాథమికం:

ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు ఏ భాషలో చదవాలని అనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలు తీసుకునే ప్రక్రియ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతుల పుస్తకాల ముద్రణ చేపట్టలేదు. విద్యాసంవత్సరం ప్రారంభం యథాతథంగా ఉంటే అప్పటికప్పుడు ముద్రణ చేసి సరఫరా చేయడం కొంత ప్రతిబంధకమే. ఈ విషయమై జిల్లా విద్యాధికారి శామ్యూల్‌ మాట్లాడుతూ, త్వరలో కలెక్టర్‌ చంద్రుడును కలిసి 6-10 తరగతుల పుస్తకాల సరఫరాకు అనుమతి తీసుకొని.. మండల వనరుల కేంద్రాలకు చేరుస్తామని చెప్పారు.

పుస్తక నిల్వలు

ఇదీ చదవండి :

'స్పోకెన్ తెలుగు' రోజులు వస్తాయేమో!

ABOUT THE AUTHOR

...view details