అనంతపురం జిల్లా ఉరవకొండలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 వరకు రక్తదాన శిబిరం కొనసాగింది. సీఐ వెంకటేశ్వర్లు స్వయంగా రక్తాన్ని దానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీస్ అధికారులతో పాటు, ఉరవకొండ పట్టణ యువత పెద్ద ఎత్తున పాల్గొని మొత్తం 45 యూనిట్ల రక్తాన్నిఇచ్చారు. పోలీసు అమరవీరుల సేవలు మరవలేనివని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు గోపి, వెంకటస్వామి, డా. ఎర్రిస్వామిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్లు, కానిస్టేబుల్లు తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
అనంతవురం జిల్లా ఉరవకొండలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను నిర్వహించారు. యువత పెద్దసంఖ్యలో పాల్గొవు 45 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు
ఉరవకొండలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం