ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిడ్కో గృహాల్లోకి ప్రవేశించి మహిళలు పూజలు - cpi protest in hindupur news

ప్రభుత్వం టిడ్కో గృహాలను పంపిణీ చేయకపోవటంతో విసిగిపోయిన లబ్ధిదారులు సీపీఐ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం గృహ ప్రవేశం చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది.

tidco houses
tidco houses

By

Published : Nov 16, 2020, 4:03 PM IST

టిడ్కో గృహాల్లోకి ప్రవేశించి మహిళలు పూజలు

అనంతపురం జిల్లా హిందూపురంలో గతంలో వీరంపల్లి వద్ద గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో బహుళ అంతస్తుల గృహసముదాయం వద్ద సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. ఇద్దరు మహిళా లబ్ధిదారులతో సీపీఐ నాయకులు గృహ ప్రవేశాలు చేయించారు. తాము ఇంటి కోసం అప్పు చేసి డీడీలు కట్టామని... ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ మహిళలు వెల్లడించారు. అందుకే నాయకుల సహకారంతో గృహ ప్రవేశాలు చేశామని తెలిపారు.

మరోవైపు సీపీఐ నాయకుడు దాదాపీర్ మాట్లాడుతూ... పేదల పట్ల వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. టిడ్కో గృహాల నిర్మాణంలో అవినీతి జరిగితే విచారణ జరిపించి బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకానీ పేదలను ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details