ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్రప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ అనంతపురంలో బంద్​లు

By

Published : Jan 8, 2020, 8:23 PM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలు బంద్ నిర్వహించాయి. పలుచోట్ల వాహనాలను అడ్డుకున్నారు. రోడ్లపై నినాదాలు చేశారు.

కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ... అనంతపురంలో బంద్​లు
కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ... అనంతపురంలో బంద్​లు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనంతపురంలో వామపక్షాలు, కార్మిక సంఘాలు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టాయి. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కొన్నిచోట్ల నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల ప్రమేయం లేకుండా చేస్తున్న సంఘాలను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. ఈ విషయంలో కొద్దిపాటి ఆందోళనలు జరిగాయి. కార్మికులు పోరాడి తెచ్చుకున్న 44 చట్టాలను ప్రభుత్వం విస్మరించి నాలుగు చట్టాలుగా మార్చడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

సోమందేపల్లి

సోమందేపల్లి మండల కేంద్రంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధించారు. రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ వాహనాల్లో అధికశాతం కియా అనుబంధ పరిశ్రమలకు కార్మికులను తరలించే బస్సులు ఉన్నాయి. బంద్ కారణంగా బస్సుల్లోనే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్మిక సమస్యలను పరిష్కరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ... అనంతపురంలో బంద్​లు
ధర్మవరం
ధర్మవరంలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. సీఐటియూ, ఏఐటియూసీ సీపీఎం(ఐ) నాయకులు, అంగన్వాడి కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములు కూడలి నుంచి ప్రధాన రహదారి మీదుగా నిరసన ర్యాలీ చేశారు.
నార్పల
నార్పల మండల కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అపాలని ప్రభుత్వ విద్య, వైద్య ఇతర రంగాలను కాపాడాలని దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బంద్ నిర్వహించారు.
కళ్యాణదుర్గం
భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గంలో సీపీఐ దాని అనుబంధ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రధాన వీధుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
పుట్టపర్తి
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సార్వత్రిక సమ్మెలో భాగంగా బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడటంతో భక్తులు పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు బస్సులు రాకపోకలకు అంతరాయం ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. పాఠశాలలు, దుకాణాలు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు.
కదిరి
కదిరిలో కార్మిక సంఘాలు వామపక్ష నాయకులు భారీ ప్రదర్శన చేపట్టారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని నిరసనకారులు ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్​కు అందజేశారు.
మడకశిర
దేశవ్యాప్త బంద్​లో మడకశిర పట్టణంలో సీపీఐ(ఎం)తో పాటు అంగన్వాడి కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు, మున్సిపాలిటీ కార్మికులు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు కలిసి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీగా బయలుదేరి రాజీవ్ గాంధీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి రాకపోకలను నిలిపివేశారు.

ఇవీ చదవండి

రోడ్డెక్కిన రాజధాని రైతులపై కేసులు..!

ABOUT THE AUTHOR

...view details