రాజధాని రైతులు మంగళవారం చేపట్టిన గుంటూరు - విజయవాడ హైవే దిగ్బంధంపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఆందోళనలో పాల్గొన్న 18 మందిపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు... 120బీ,143, 341, 353, 506 కింద కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది పేర్లను సైతం ఫిర్యాదులో పోలీసులు ప్రస్తావించారు. చినకాకాని వీఆర్వో కొండవీటి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు పెట్టినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. బెజవాడ నరేంద్ర, వాకచర్ల వీరాంజనేయులు, ఆలూరి శ్రీనివాసరావు, పువ్వాడ సుధాకర్, ఆలూరు సుబ్రహ్మణ్యం, మాదాల వెంకటేశ్వరరావు, వడ్లమూడి నాగమల్లేశ్వరరావు, కొండేపాటి సతీష్ చంద్ర, గడ్డం మార్టిన్, బేతపూడి సుధాకర్, యుగలాదాస్ సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గిరీష్, యుగలాదాస్ రాజప్ప, కొండేటి మరియదాసు, కొండేటి తిమోతి, ఆలూరు యుగంధర్, ఆకుల ఉమ, పత్తిపాటి అంజిబాబుపై కేసులు నమోదయ్యాయి.
చట్ట వ్యతిరేక చర్యలే
ఆందోళనకారులు చట్ట వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా పట్టించుకోలేదని... వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. పోలీసు విధులకు సైతం ఆటంకం కలిగించారని అన్నారు. అమరావతి రాజకీయ ఐకాస, అమరావతి రాజకీయేతర ఐకాస, మహిళా ఐకాస, విద్యార్థి ఐకాసకు చెందిన 600 మంది నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: