అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మూడెకరాల అరటితోట నేలకూలింది. గుడిబండ మండలం పీఎన్ పాల్యం గ్రామంలో బలమైన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి... శివన్న అనే రైతు పొలంలో అరటి తోట పూర్తిగా నాశనమైంది. నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి అరటి పంట సాగు చేశానని.... పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తనను నట్టేట ముంచిందని శివన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.
అప్పు తెచ్చి సాగు చేసిన అరటి... ఆకాల వర్షానికి ఆగం.. - అనంతపురం జిల్లా తాజా వార్తలు
అనంతపురం జిల్లా పీఎన్ పాల్యంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటిపంట నేలకూలింది. అప్పుతెచ్చి సాగుచేశానని... అకాల వర్షంతో నష్టపోయానని రైతు వాపోతున్నాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Banana crop loss due to heavy rain at pn. palyam IN ananthapuram district