ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో బలిజ సంఘం నాయకుల ధర్నా

కాపులకు 5 శాతం రిజర్వేషన్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో బలిజ సంఘం నాయకులు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

BalijaSangam leaders held a rally with black flags in Anantapur district to protest the cancellation of 5 per cent reservation for Kapu

By

Published : Aug 3, 2019, 1:47 PM IST

కదిరిలో బలిజసంఘం నాయకులు ధర్నా...
కదిరిలో బలిజ సంఘం నాయకులు నల్ల జెండాలతో ర్యాలీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ లు ఇస్తూ శాసనసభలో తీర్మానం చేసిందని బలిజ సంఘం నాయకుడు భైరవ ప్రసాద్ అన్నారు. అప్పుడు మద్దతు తెలిపిన వైకాపా అధికారంలోకి రాగానే.... రిజర్వేషన్లను రద్దు చేయడం కక్షపూరిత చర్య అని అన్నారు. రిజర్వేషన్ల విషయంపై జగన్ ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో అధికసంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details