ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారమివ్వాలి: బాలకృష్ణ

ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

balakrishna demands compensation
కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారమివ్వాలి

By

Published : May 3, 2021, 8:29 PM IST

కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారమివ్వాలి

అనంతపురం జిల్లా హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 8 మంది కొవిడ్ రోగులు చనిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హిందుపురం ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని.. వెంటిలేటర్లు సమకూర్చి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్య శాఖమంత్రి, కలెక్టర్, డీఎంహెచ్​వోను కోరినట్లు తెలిపారు.

అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వల్లే రాష్ట్రంలో అనేక మంది కరోనా చికిత్స పొందుతూ చనిపోతున్నారని ఆరోపించారు. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాలయ్య మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండటం వల్లే ఎటు చూసినా చావుకేకలు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్.. చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రాకుండా.. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరాన్ని పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details