అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్కాపురం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పల్లెపల్లి గ్రామానికి చెందిన లలితమ్మ(35) అనే మహిళ అక్కకికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రావణ శుక్రవారం కావడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి గంగప్ప అనే రైతు గంగ పూజలు జరుపుకున్నారు. అనంతరం ఎడ్లబండి, ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్ అండ్ బీ రహదారిలో పెద్ద మలుపు వద్ద వేగంగా వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటో యజమాని గంగాధర కుమారుడు(8 ఏళ్లు) ఆటోను నడుపుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న రాజశేఖర్, తమన్న, గంగమ్మ, అనులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై రాయదుర్గం సీఐ తులసీరామ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఆటో బోల్తా పడి మహిళ మృతి - malkapuram road accident latest news
రాయదుర్గం మండలం మల్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లలితమ్మ అనే మహిళ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం సీఐ తెలిపారు.
ఆటో బోల్తా పడి మహిళ మృతి