ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

POWER CUT: ప్రభుత్వ కార్యాలయాలకు నిలిచిన పవర్..ఎందుకంటే! - అనంతపురం జిల్లా ముఖ్యంశాలు

అనంతపురం జిల్లా నీటి యాజమాన్య కార్యాలయానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని 18 రోజుల క్రితం మున్సిపాలిటీ కార్యాలయానికి విద్యుత్ నిలిపివేశారు. రెండు ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ నిలిచిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్
ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్

By

Published : Sep 14, 2021, 9:29 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్‌ కార్యాలయానికి.. 18 రోజుల క్రితం విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు.. తాజాగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయానికీ సరఫరా తొలగించారు. మున్సిపల్ కార్యాలయానికి గతనెలలో సరఫరా తొలగించడం వల్ల..వివిధ పథకాల్లో మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మున్సిపల్ కార్యాలయంలో పలు ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్న లబ్ధిదారుల కోసం పక్కనే ఉన్న డ్వామా కార్యాలయం నుంచి సరఫరా తీసుకొని చిన్న చిన్న పనులు చేస్తుండటంతో పలుమార్లు హెచ్చరించినట్లు విద్యుత్ అధికారులు వివరిస్తున్నారు. ఆయినా ఖాతరు చేయకపోవడంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయానికి కూడా విద్యుత్ సరఫరా తొలగించినట్లు, తమకు ఆ హక్కు ఉన్నట్టు విద్యుత్ శాఖ ఈఈ శేషాద్రిశేఖర్ తెలిపారు.

మున్సిపాలిటీ కార్యాలయం విద్యుత్ శాఖకు రూ.6.5 కోట్ల మేర బకాయి ఉన్న మాట వాస్తవమేనని.. వారం రోజుల్లోగా కొంత చెల్లిస్తామని వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్రాముడు తెలిపారు. ఏది ఏమైనా నా రెండు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా తొలగించటం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

కణేకల్లు పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ నిలిపివేత..

కణేకల్లు పంచాయతీ కార్యాలయానికి అధికారులు విద్యుత్‌ నిలిపివేశారు. బిల్లుల బకాయిలు రూ.6 కోట్లు కట్టలేదని విద్యుత్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

ఇదీ చదవండి:

నదిలో పడవ బోల్తా- ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి!

ABOUT THE AUTHOR

...view details