మహిళను వివస్త్రను చేసి, విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే పట్టణానికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేసి విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. చెప్పులతో కొడుతూ, కాళ్లతో తంతూ తీవ్రంగా గాయపరిచారు.
ఈ రాక్షసకాండను అడ్డుకున్న స్థానికులు మహిళ శరీరంపై టవల్ కప్పి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోగా మహిళకు జీవనోపాధి అయిన పండ్ల బండిని ధ్వంసం చేశారు. పండ్లను రోడ్డుపై చెల్లాచెదురుగా పారబోసి వీరంగం సృష్టించారు.