దరఖాస్తుదారులు అడిగిన సమాచారాన్ని గడువులోపు ఇచ్చేలా అధికారులు పీఐఓలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సమాచార హక్కు రాష్ట్ర ప్రధాన కమిషనర్ రవికుమార్ సూచించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారం క్రిందిస్థాయిలో వెంటనే ఇవ్వగలిగితే ఫిర్యాదులు 50 శాతంపైగా తగ్గుతాయని తెలిపారు. ప్రధానంగా ఐదు ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం ఇవ్వడంలో పీఐఓలు, అప్పిలేట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చురకలేశారు. ప్రజల్లో సమాచార చట్టంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆయన వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కమిషన్ కు వచ్చే ఫిర్యాదులు పరిష్కారానికి మూడు నెలలకోసారి జిల్లాల వారీగా పర్యటించి, విచారణలు నిర్వహిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
'దరఖాస్తుదారులకు సమాచారాన్ని గడువులోగా ఇవ్వాలి' - RTI
సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తుదారులు అడిగిన సమాచారాన్ని గడువులోపు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు రాష్ట్ర ప్రధాన కమిషనర్ రవికుమార్ అధికారులను ఆదేశించారు.
దరఖాస్తుదారులకు సమాచారాన్ని గడువులోగా ఇవ్వాలి