ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కియా' ఎక్కడికీ వెళ్లడంలేదు... అన్నీ తప్పుడు కథనాలే: మంత్రి బుగ్గన

కియా కార్ల పరిశ్రమ ఎక్కడికి తరలిపోవడంలేదని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి స్పష్టంచేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవాలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

ap state finance minister buggana rajendranath reddy clarify about kia car industry
బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి

By

Published : Feb 6, 2020, 3:31 PM IST

కియా పరిశ్రమపై మాట్లాడుతున్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి

అనంతపురం జిల్లా నుంచి కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తవమని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ కథనాలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. ప్లాంటు విస్తరణకు ప్రణాళికలు చేస్తుంటే తరలిపోయే అవకాశం ఎక్కడిదని ప్రశ్నించారు. ప్లాంటు పూర్తి సామర్థ్యంతో పని చేస్తూ కార్లను మార్కెట్​లోకి తీసుకొస్తోందన్నారు. విశాఖలోని మిలీనియం టవర్స్​ను ఖాళీ చేయాలని ఆదేశించినట్లు వచ్చిన కథనాలూ అవాస్తవాలేనని తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి రాతపూర్వక లావాదేవీలు జరగలేదని వివరించారు. సామజిక మాధ్యమాల్లో జరిగే ఇలాంటి ధోరణి నియంత్రించాల్సని అవసరం ఉందన్నారు.

మేం ప్రచారానికి విరుద్ధం

తమ ప్రభుత్వం ప్రచారానికి విరుద్ధమని మంత్రి బుగ్గన తెలిపారు. 2019 అక్టోబర్ వరకు పెట్టుబడులు వచ్చాయని కేంద్రం నివేదిక చెబుతోందని.. 1051 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయని తెలిపారు. జూన్ 2019 నుంచి రూ.15,600 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. మరో 8 వేల కోట్ల మేర కంపెనీలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తమ హయాంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయన్నారు.

ఇవీ చదవండి... ఇదో.. నేరకథా చిత్రమ్..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details