ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 6, 2021, 12:48 PM IST

ETV Bharat / state

ఈ "టీచర్ మాకొద్దు" అంటూ గుత్తిలో విద్యార్ధులు ఆందోళన

ఈ "టీచర్ మాకొద్దు" అంటూ గుత్తిలో ఏపీ రెసిడెన్సీ గురుకుల పాఠశాల విద్యార్ధులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించటంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

AP Residency Gurukul School students protest
ఏపీ రెసిడెన్సీ గురుకుల పాఠశాల విద్యార్ధులు ఆందోళన

అనంతపురం జిల్లా గుత్తిలోని ఏపీ రెసిడెన్సీ గురుకుల పాఠశాల విద్యార్ధులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ "టీచర్ మాకొద్దు" అంటూ ఎన్టీఆర్ కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గతంలోనే ఫిర్యాదు..

నాణ్యత లేని భోజనం పెట్టటం, అసభ్య పదజాలంతో మాట్లాడటం చేస్తున్నారంటూ.. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలు రేణుకపై అధికారులకు గతంలో విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పట్లో ఆమెను మరో ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే మరోసారి ఆమె గుత్తికి బదిలీ మీద అదే పాఠశాలకు రావటంతో.. ఈ టీచర్ మాకొద్దు అంటూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయురాలికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నగరంలో 30 యాక్ట్ అమలులో ఉన్నందునా రాస్తారోకో చేసేందుకు అనుమతి లేదంటూ విద్యార్థి సంఘాల నాయకులకు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.

ఇవీ చూడండి..

ప్రియుడితో కలిసి భర్త హత్యకు మహిళ పన్నాగం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details