రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అనంతపురం జిల్లా కదిరిలో ఏపీ రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. లాక్ డౌన్ వల్ల రైతులు పండించిన పంటలను అమ్ముకోలేక అప్పుల పాలయ్యారని.., వారిని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతు సంఘం నాయకులు, కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి, ఆర్డీఓ రామ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో రైతులకు నేరుగా సాయం అందే పరిస్థితి లేదన్నారు. 18 వేల రూపాయలు రైతు భరోసా ద్వారా సాయం అందించాలని నాయకులు కోరారు. అర్హులైన రైతులందరికీ రాయితీ విత్తన వేరుశెనగ అందించాలని విజ్ఞప్తి చేశారు.
కదిరిలో రైతు సంఘాల నిరసన - farmes in lockdown
లాక్డౌన్లో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అనంతపురం జిల్లా కదిరిలో ఏపీ రైతు సంఘం నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
కదిరిలో రైతు సంఘాల నిరసన