ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్నంలో పౌష్టికాహారం అందివ్వని అంగన్వాడీ కార్యకర్త'

చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కార్యకర్త ఇవ్వట్లేదని అనంతపురం జిల్లా పట్నం గ్రామస్థలు నిరసన చేపట్టారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు.. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులతో వివరాలు సేకరించారు.

Anganwadi activist in Patnam village didnot provide nutrition to children
సచివాలయ సిబ్బందికి మహిళ ఫిర్యాదు

By

Published : Apr 14, 2020, 7:05 PM IST

లాక్ డౌన్ దృష్ట్యా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నవారికి వారానికొకసారి గుడ్లు, కందిపప్పు, బియ్యం అందించాలని ప్రభుత్వం సూచించింది. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారాన్ని ఇవ్వట్లేదని అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం గ్రామస్థలు నిరసన చేపట్టారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రభుత్వ సూచనను పెడచెవిన పెడుతూ పిల్లలకు గర్భవతులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.

ఈ వ్యవహారం అంగనవాడి పర్యవేక్షకులకు తెలిసే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థుల ఫిర్యాదుతో సచివాలయ సిబ్బంది లబ్ధిదారులతో వివరాలు సేకరించారు. తరువాత స్టాక్ వివరాలను అంగన్వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకోగా..ఆమె పొంతన లేని సమాధానం చెప్పినట్టు ఆగ్రహించారు. పౌష్టికాహార నిలువల్లో తేడాను గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని సచివాలయ ఉద్యోగి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details