Andhra Pradesh Road Accidents Today: అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ సమీపంలో రాళ్ల లోడుతో వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో పక్కకు నిలిపారు.
అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న ఖాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
విశాఖపట్నంలో లారీని ఢీ కొట్టిన ఆటో - చెల్లాచెదురుగా పడిపోయిన విద్యార్థులు - భీతావహంగా సీసీ కెమెరా దృశ్యాలు
శబరిమల వెళ్తున్న బస్సు ఢీకొని ఒకరు మృతి:తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. డ్రైవర్, క్లీనర్ రోడ్డు దాటుతుండగా, శబరిమల వెళ్తున్న బస్సు వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కరెంట్ స్తంభాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. కట్టుబడి పాలెం నుండి లోడ్‌తో తెలంగాణ ముత్తగూడెంకు క్రషర్ డస్ట్ లోడ్‌తో వెళుతున్న టిప్పర్ మైలవరం మండలం పుల్లూరు వద్ద కరెంట్ స్తంభాన్ని డీకొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగానికి ఇద్దరు బలి - రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బైక్, కారు
లారీ ఢీకొని చిరుత పిల్ల మృతి: లారీ ఢీకొని చిరుత పిల్ల మృతి (Leopard Cub Died in Road Accident Vizianagaram) చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం రామభద్రపురం మండలం తారాపురం గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం వేకుజామున చిరుతపులి పిల్లను లారీ ఢీకొంది. దీంతో చిరుతకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు - ఏడుగురు మృతి