2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతం అనంతపురం జిల్లా కదిరికి వచ్చిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు వైకాపా నేతలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గానికి సరిహద్దు గ్రామమైన పట్నం చేరుకున్న కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. కదిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం దివంగతం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ సారథ్యంలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు.
"గోరంట్ల"కు వైకాపా శ్రేణుల ఘన స్వాగతం - gorantla madhav
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారిగా అనంతపురం జిల్లా కదిరికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలకు వైకాపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
ఎమ్మెల్యే, ఎంపీకి వైకాపా శ్రేణుల ఘనస్వాగతం