అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన తొలిచూరి ఆంజనేయులు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న 5ఎకరాల భూమిలో వేరుశనగ, టమాట పంటలు సాగు చేసేవాడు. నీటికొరత ఏర్పడటంతో... ఇటీవల బోర్లు వేశాడు. దీంతో రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. బోర్లలో నీరు కూడా రాకపోవటంతో... పంటలు పండవని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు మృతిపెట్ల తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులబాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య - అనంతపురం జిల్లా
అప్పులబాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చోటుచేసుకుంది.
ఆత్మహత్య చేసుకున్న రైతు