అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్.. కరోనా లక్షణాలతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించగా.. కర్నూలుకు తరలిస్తుండగానే ప్రాణం విడిచారని పోలీసులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. రాజశేఖర్‌కు నెగటివ్ వచ్చింది. కానీ... వారం రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నందున మళ్లీ పరీక్షలు చేయించుకోగా.. వైరస్ ఉన్నట్లు తేలింది. చివరికి విషమ పరిస్థితుల్లో ఆయన కోవిడ్ కు బలయ్యారు.