కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్ల పైకి రాకూడదంటూ హెచ్చరిస్తున్నారు. అనవసరంగా వచ్చిన వారిపై లాఠీ చార్జి చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో పురవీధులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యవసర సముదాయాలు, హోటళ్లను పోలీసులు మూయించివేశారు.
జిల్లాలో వ్యాప్తంగా లాక్ డౌన్... కఠినంగా అమలు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోనూ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై లాఠీఛార్జ్ చేస్తున్నారు.
జిల్లాలో కొనసాగుతోన్న బంద్... అనవసరంగా బయటొకొస్తే లాఠీఛార్జ్