అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 70 శాతం పోలింగ్ నమోదయింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. ఇంకొన్ని చోట్ల ఒక గుర్తుపై ఓటు వేస్తే ఇంకో గుర్తు చూపిస్తుందన్న కారణంగా కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది.
గ్రామాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. గ్రామస్థులు ఓట్లు వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం మిషన్లను అధికారులు ఏజెంట్ల సమక్షంలో భద్రపరిచి వాటికి సీల్ వేశారు.
ఉరవకొండ నియోజకవర్గంలో 70శాతం పోలింగ్ - అనంతపురం
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 70శాతం ప్రజలు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. గ్రామాల్లో ఎక్కువ పోలింగ్ నమోదైంది. చిన్నపాటి ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది.
ఉరవకొండ నియోజకవర్గంలో 70శాతం పోలింగ్ నమోదైంది.
ఇవీ చూడండి.