అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రూ 2.05 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పురపాలక సంఘం పరిధిలోని భవనాల మరమ్మతులు, తాగునీటి సరఫరా, మున్సిపల్ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి పనులకుగాను గుత్తేదారులు వేసిన టెండర్లకు ఆమోదం తెలిపారు.
రాయదుర్గంలో రూ. 2.05 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం - Rayadurgam
రాయదుర్గం పట్టణంలో రూ 2.05 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాయదుర్గం
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఛైర్పర్సన్ పోరాళ్ళు శిల్ప, మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్, కమిషనర్ జబ్బర్ మియా, వార్డు మెంబర్లు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఎవరు అధికారంలో ఉన్నా.. రాయలసీమకు అన్యాయమే చేస్తున్నారు'