అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని రెండవ వార్డు చీపులేటిలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. కాలనీవాసులు రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా వార్డులో రెండు వందల ఇళ్లకు నీటి సరఫరా చేసే బోరు మరమ్మతు గురై 10 రోజులైందని.. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆందోళన చేపట్టామని మహిళలు తెలిపారు. నీటి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారు.
'నీటి సమస్య పరిష్కరించాలంటూ.. రహదారిపై మహిళల బైఠాయింపు' - అనంతపురం జిల్లా మడకశిర మహిళలు నీటి సమస్యలు పరిష్కరించాలంటూ రహదారిపై బైఠాయింపు
అనంతపురం జిల్లా మడకశిరలో 10 రోజుల నుంచి నీటి సమస్య ఎదుర్కొంటున్న మహిళలు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. చివరికి పోలీసుల హామీతో వారు శాంతించారు.

కాలనీవాసులు రహదారిపై బైఠాయించారు