అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆధార్ కార్డు పోందటం, మార్పులుచేర్పులు చేసుకోవడం కష్టతరంగా మారింది. నియోజకవర్గంలోని 5 మండలాలు, పక్కనే ఉన్న ఉరవకొండ ప్రాంతంలోని మరికొన్ని మండలాలకు ఒకే కేంద్రం ఉంది ఫలితంగా ఇబ్బందులు తప్పటం లేదు. మొన్నటి వరకు మీసేవా కేంద్రాల్లో ఈ సదుపాయం ఉన్నా... ప్రస్తుతం అది రద్దు అయింది. ఇప్పడు ఒక్క బ్యాంకులో మాత్రమే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆధార్లో మార్పుల కోసం.. ఈ కష్టాలు తప్పవు..!
ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కళ్యాణదుర్గం వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాలు, పక్క ప్రాంతాల ప్రజలకు ఒకే కేంద్రం ఉంది. ఫలితంగా పడిగాపులు తప్పడంలేదు. తెల్లవారుజాము నుంచే... క్యూలో నిలబడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఒక్కోవ్యక్తి నాలుగైదుేసార్లు వచ్చినా ఆధార్ సమస్య పరిష్కారం కావండవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రికి వచ్చి తెల్లవారుజాము నుంచే చలిలో వణుకుతూనే లైన్లో నిల్చుంటున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోవ్యక్తి నాలుగైదుసార్లు వచ్చినా... సమస్య తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొవటంలేదని ఆవేదన వ్యక్తం చేసున్నారు. అధికారులు స్పందించి మరిన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు
ఇదీ చదవండీ...కృష్ణాయపాలెం: చేతులకు సంకెళ్లతో రైతుల నిరసన