అనంతపురం జిల్లా మడకశిర మండలం ఎల్లోటి గ్రామంలో యాచకులు, జోగయ్యలు గ్రామం బయట డేరాలు వేసుకొని పదేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న 20 కుటుంబాల్లో... 13 కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. కరోనా ప్రభావం, లాక్డౌన్ వల్ల పనులులేక, ఊరిలోకి ఎవరినీ రానీయక తిండిదొరకటం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులున్న పేదలందరికీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కందిపప్పు అందిస్తున్నా..తమకు మాత్రం ఏ సాయం అందటం లేదని వాపోతున్నారు. రేషన్ కోసం వెళితే కార్డులు తొలగించారని చెబుతున్నారంటున్నారు. అధికారులు స్పందించి తమ ఆకలి గోడు తీర్చాలని వేడుకుంటున్నారు.
ఆకలి గోడు: రేషన్ కార్డులున్నా అందని ప్రభుత్వ సాయం - అంతపురం లాక్డౌన్ న్యూస్
లాక్డౌన్.. యాచకులు, రోజుకూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పనులు లేక, గ్రామాల్లోకి ఎవరినీ అనుమతించక పస్తులుండాల్సిన పరిస్థితులు కల్పిస్తోంది. కనీసం ప్రభుత్వాలు అందించే రేషన్, నగదు సాయంతోనైనా ఆకలి తీర్చుకుందామనుకున్న వారికి నిరాశే మిగిలింది. అనంతపురం జిల్లా ఎల్లోటి గ్రామంలోని జోగయ్యలు, యాచకులదీ ఇదే దీనస్థితి. గ్రామ శివార్లలో నివసిస్తున్న వీరంతా రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. రేషన్ కోసం చౌక దుకాణానికి వెళ్తే.. తమ కార్డులు తొలగించారని డీలర్ చెబుతున్నట్టు వాపోయారు.
రేషన్ కార్డులున్నా అందని ప్రభుత్వ సాయం