ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మలివిడత కరోనా వ్యాప్తి ముప్పుపై అవగాహన

మలివిడత కరోనా వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ డా.సిరి చెప్పారు. ఈ విషయమై యాభై రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

By

Published : Dec 13, 2020, 11:27 AM IST

awareness program
కరోనా వ్యాప్తిపై అవగాహనా కార్యక్రమం

కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉంటుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జేసీ సిరి చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంయుక్త కలెక్టర్ మాట్లాడారు. యాభై రోజుల పాటు వైరస్​పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం జనవరి 19 వరకు కొనసాగుతుందని చెప్పారు.

రేషన్ దుకాణాలు, సూపర్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లలో మాస్క్ లేకుండా ప్రవేశం ఉండదని.. ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే మాస్క్​లు పెట్టుకోవటంపై మహిళా సంఘాలు, అంగన్ వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details