ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని హనుమన్ కూడలిలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పుట్టపర్తిలో ఉన్నాయన్నారు. 300 పడకల ఆసుపత్రి, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, సత్యసాయి విశ్వవిద్యాలయం, భవన నిర్మాణాలకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. సత్యసాయి జిల్లా ఏర్పాటుకు శనివారం.. అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించి, జేఏసీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
'పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలి'
పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రానికి కావలసిన సౌకర్యాలు, సదుపాయాలు అన్నీ పుట్టపర్తిలో ఉన్నాయని తెలిపారు.
పుట్టపర్తిలో ఆందోళన చేస్తున్న అఖిల పక్షం నేతలు